Share News

తాను కన్నుమూసి.. ఇద్దరికి చూపునిచ్చి

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:55 AM

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడు.. ఇద్దరికి చూపునిచ్చాడు. యాదమరి మండలం జోడిచింతల గ్రామానికి చెందిన ఎం.సందీప్‌ (31) చిత్తూరు రూరల్‌ మండలం నెమలికొండ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

తాను కన్నుమూసి.. ఇద్దరికి చూపునిచ్చి
సందీప్‌ (ఫైల్‌ ఫొటో)

తల్లిబాటలోనే సందీప్‌ నేత్రదానం

పుట్టెడు దుఃఖంలోనూ ముందుకొచ్చిన కుటుంబీకులు

యాదమరి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడు.. ఇద్దరికి చూపునిచ్చాడు. యాదమరి మండలం జోడిచింతల గ్రామానికి చెందిన ఎం.సందీప్‌ (31) చిత్తూరు రూరల్‌ మండలం నెమలికొండ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈయన కుటుంబ సభ్యులందరూ ముందుగానే నేత్రదానానికి అంగీకారం చెప్పి ఉన్నారు. ఈ క్రమంలో పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ వైద్య నిపుణులు గ్రామానికి వచ్చారు. సందీప్‌ కళ్లను సేకరించారు. సందీప్‌ అన్న దిలీ్‌పకు అవయవ దాన పత్రం అందజేశారు. కాగా, సందీప్‌ తల్లి రాధమ్మ ఆరునెలల కిందట మరణించగా, నేత్రదానం చేశారు. మరెందరికో వీరు ఆదర్శంగా నిలిచారు.

Updated Date - Nov 05 , 2026 | 12:55 AM