‘రాయలసీమ రైజింగ్’ కాంటెస్టులో పాల్గొనండి
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:28 AM
రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపడుతున్న ‘‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్- రాయలసీమ విజయీభవ’’ కార్యక్రమంపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వీడియో మేకర్లు, విద్యార్థులు, ఆసక్తి ఉన్నవారికి రీల్/వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(అవిలాల), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపడుతున్న ‘‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్- రాయలసీమ విజయీభవ’’ కార్యక్రమంపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వీడియో మేకర్లు, విద్యార్థులు, ఆసక్తి ఉన్నవారికి రీల్/వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను దేశపు గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసే విధానాన్ని సృజనాత్మకంగా, వినూత్నంగా ప్రజలకు వివరించేలా వీడియోలను రూపొందించాలని ఆయన సూచించారు. జిల్లా లేదా ఒక ఉద్యాన ఉత్పత్తిని ప్రధాన అంశంగా తీసుకుని కూడా వీడియో రూపొందించవచ్చన్నారు. 60 నుంచి 90 సెకన్ల వ్యవధి కలిగిన రీల్/వీడియోలను ఈనెల 26 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన ఉత్తమ 5 వీడియోలను మదనపల్లెలో వచ్చే నెల 2న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 50 వేల మంది ప్రజల సమక్షంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వీడియోలను తిలకిస్తారన్నారు.విజేతలను ప్రముఖుల చేతులమీదుగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. 30వ తేదీ లోగా విజేతలను ఖరారు చేసి, అక్టోబర్ 1న సమాచారం అందించనున్నట్లు వివరించారు.