Share News

ముగిసిన పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:52 AM

జిల్లాలోని 619 పంచాయతీల సర్పంచులు, 5882 వార్డు స్థానాల రిజర్వేషన్‌ ప్రక్రియ బుధవారం రాత్రి పూర్తయింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ గెజిట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సమిత్‌ కుమార్‌ విడుదల చేశారని డీపీవో కె.సుధాకర్‌రావు గురువారం తెలిపారు.

ముగిసిన పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 619 పంచాయతీల సర్పంచులు, 5882 వార్డు స్థానాల రిజర్వేషన్‌ ప్రక్రియ బుధవారం రాత్రి పూర్తయింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ గెజిట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సమిత్‌ కుమార్‌ విడుదల చేశారని డీపీవో కె.సుధాకర్‌రావు గురువారం తెలిపారు. పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టర్‌చే ప్రచురితమైన గెజిట్‌ మేర సర్పంచ్‌, వార్డు స్థానాల రిజర్వేషన్ల వివరాలను ఆయన వెల్లడించారు.

ఫ 622 సర్పంచి స్థానాల రిజర్వేషన్‌

ఎస్టీలు (19): జనరల్‌ 16, మహిళలు 3

ఎస్సీలు(155): జనరల్‌ 83, మహిళలు 72

బీసీలు(126): జనరల్‌ 64, మహిళలు 62

వంద శాతం ఎస్టీలు(6): జనరల్‌ 4, మహిళలు 2

అన్‌రిజర్వ్‌డ్‌(316): జనరల్‌ 153, మహిళలు 163

ఫ 5906 వార్డు స్థానాలు

ఎస్టీలు (183): జనరల్‌ 125, మహిళలు 58

ఎస్సీలు (1386): జనరల్‌ 785, మహిళలు 601

బీసీలు (1326): జనరల్‌ 709, మహిళలు 617

అన్‌రిజర్వ్‌డ్‌ (3011): జనరల్‌ 1342, మహిళలు 1669

Updated Date - Oct 16 , 2026 | 01:52 AM