‘సరిహద్దు’ ఉద్యోగులకు 23న పెయిడ్ హాలిడే
ABN , Publish Date - Apr 05 , 2026 | 01:08 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటరుగా ఉంటూ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటరుగా ఉంటూ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. నగరి నుంచి కుప్పం వరకు దాదాపు 20కిపైగా మండలాలు తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ మండలాల్లోని ఉద్యోగులు తమిళనాడులో ఓటరుగా ఉంటూ ఇక్కడ పనిచేస్తున్నారు. వీరందరికీ ఈనెల 23న పోలింగ్ డే సందర్భంగా వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది.