Share News

3 జడ్పీటీసీ అప్పీళ్లలో రెండు ఆమోదం--ఒకటి తిరస్కరణ,

ABN , Publish Date - Oct 27 , 2026 | 02:01 AM

పరిషత్తు ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల పరిశీలన ఆదివారం ముగిసింది. అయితే తిరస్కరించిన నామినేషన్‌ పత్రాల అభ్యర్థులు అప్పీల్‌ చేసుకోగా సోమవారం వాటిని పరిశీలించారు.

3 జడ్పీటీసీ అప్పీళ్లలో రెండు ఆమోదం--ఒకటి తిరస్కరణ,

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పరిషత్తు ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల పరిశీలన ఆదివారం ముగిసింది. అయితే తిరస్కరించిన నామినేషన్‌ పత్రాల అభ్యర్థులు అప్పీల్‌ చేసుకోగా సోమవారం వాటిని పరిశీలించారు.జడ్పీటీసీకి వచ్చేసరికి ఆదివారం 280మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందగా, 3 తిరస్కరణకు గురయ్యాయి.వీటిని సోమవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పరిశీలించారు. తొట్టంబేడు జడ్పీటీసీ అభ్యర్థులు మణిబాబు(వైసీపీ), పెనగడం గురవయ్య (సీపీఎం) నామినేషన్లు ఆమోదం పొందగా పాకాల జడ్పీటీసీ అభ్యర్థి స్వర్ణకుమారి(వైసీపీ) నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. జిల్లావ్యాప్తంగా 444 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,950 నామినేషన్లు వచ్చాయి.వాటిలో 779 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 191 నామినేషన్లను ఆర్డీవోల వద్ద అప్పీలు చేసుకున్నారు.49ఆమోదం పొందగా 142 తిరస్కరణకు గురయ్యాయి.తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవోలు తమ పరిధిలోని ఎంపీటీసీ అభ్యర్థుల అప్పీళ్లను పరిష్కరించారు. అందులో భాగంగా సూళ్ళూరుపేట రెవెన్యూ డివిజన్‌లో 13మంది అభ్యర్థులు సోమవారం ఆర్డీవో దేవేంద్రరెడ్డికి అప్పీలు చేసుకోగా 8 నామినేషన్లు ఆమోదం పొందాయి.ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌కు వచ్చేసరికి 41మంది అప్పీలు చేసుకోగా 12 ఆమోదం పొందగా 29 తిరస్కరణకు గురయ్యాయి.వీటిలో సీపీఎం నుంచి 5, టీడీపీనుంచి 1, వైసీపీనుంచి 5 నామినేషన్లు వున్నాయి. తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో 137 మంది అభ్యర్థులు ఆర్డీవో రామ్మోహన్‌ వద్ద అప్పీలు చేసుకోగా 29 ఆమోదించబడ్డాయి.108తిరస్కరణకు గురయ్యాయి.వీటిలో 103 వైసీపీ అభ్యర్థులవి కాగా రెండు టీడీపీ,రెండు జనసేన అభ్యర్థులవి .ఒకటి ఇండిపెండెంట్‌ అభ్యర్థిది.

Updated Date - Oct 27 , 2026 | 02:01 AM