Share News

మా భూములను వైసీపీ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:49 AM

తమ భూములను పూతలపట్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో వారు నిరసన వ్యక్తం చేశారు.

మా భూములను వైసీపీ మాజీ ఎమ్మెల్యే  కబ్జా చేస్తున్నారు
అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన తెలుపుతున్న రైతులు

పుంగనూరు రూరల్‌, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): తమ భూములను పూతలపట్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో వారు నిరసన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ పుంగనూరు మండలం ఆరడిగుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 254/2లో దాదాపు 42 ఎకరాలు వ్యవసాయ భూమిని 1994లో ప్రభుత్వం తమకు పట్టాలు మంజూరు చేసిందన్నారు. గత ఏడాది నుంచి మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ 42 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని, భూమిలోకి ఎవరూ రాకూడదని బెదిరిస్తున్నారని అన్నారు. భూమికి కంచె వేయడానికి రెండుసార్లు ఆయన ప్రయత్నం చేయగా అడ్డుకుని పోలీసుకు ఫిర్యాదు చేశామన్నారు. నిరసనలో సీపీఐ నాయకులు వెంకటరమణారెడ్డి, మున్నా మద్దతు పలికారు. కార్యక్రమంలో రైతులు నారాయణరెడ్డి, రామచంద్రయ్య, రాజన్న, కృష్ణంరాజు, లక్ష్మయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 01:49 AM