‘వందేభారత్’కు ఆరెంజ్ రంగు
ABN , Publish Date - Jan 15 , 2026 | 02:03 AM
తిరుపతి-సికింద్రాబాదు వందేభారత్ రైలు ఇప్పుడు ఆరెంజ్ కలర్‌లో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలును 2023 ఏప్రిల్ 9న ప్రారంభించారు. కొన్ని నెలలపాటు 8 బోగీలతో నడిచింది.
20 బోగీలకు పెంపు
తిరుపతి(రైల్వే), జనవరి 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి-సికింద్రాబాదు వందేభారత్ రైలు ఇప్పుడు ఆరెంజ్ కలర్‌లో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలును 2023 ఏప్రిల్ 9న ప్రారంభించారు. కొన్ని నెలలపాటు 8 బోగీలతో నడిచింది. ప్రయాణికుల ఆదరణ ఉండటంతో 16 బోగీలకు పెంచారు. మళ్లీ డిమాండ్ పెరగడంతో 20 బోగీలకు పెంచేశారు. కొత్తగా ఆరెంజ్ రంగులో 20 బోగీల రైలుగా మారింది. ఇందులో 1,440సీట్ల సామర్థ్యం ఉంది. తిరుపతి మీదుగా రాకపోకలు సాగించే అతిపెద్ద రైళ్లలో ఇదొకటి. కాగా, 102 వందేభారత్ రైళ్లలో ఈ రైలు మాత్రమే ప్రత్యేకంగా ఆరెంజ్ రంగులో నడుస్తుండడం విశేషం. గతంలో తెలుపురంగులో ఉంది.