Share News

కాణిపాకంలో కొనసాగుతున్న రద్దీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:45 AM

కాణిపాకంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి స్వామి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలోపల క్యూలైన్లు నిండిపోయి వెలువల వరకు కొనసాగింది.

కాణిపాకంలో కొనసాగుతున్న రద్దీ

ఐరాల (కాణిపాకం), జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి స్వామి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలోపల క్యూలైన్లు నిండిపోయి వెలువల వరకు కొనసాగింది. దీంతో స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ చైర్మన్‌ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్‌ పర్యవేక్షించారు. క్యూలైన్లలో భక్తుల దాహార్తి తీర్చడానికి సిబ్బంది తాగునీరు, మజ్జిగ అందించారు.

Updated Date - Jun 08 , 2026 | 12:45 AM