మరోసారి ‘ఏఎ్‌సడీ’ ఓటర్ల పరిశీలన
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:52 AM
ఏఎ్‌సడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓటర్లపై ఆందోళనల నేపథ్యంలో జిల్లాలో మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు ఏఎ్‌సడీ ఓటర్ల జాబితాల ఆధారంగా ఆయా ఇళ్లకు వెళ్లి వివరాలను పునఃపరిశీలించనున్నారు.
1,38,548 ఓటర్లను పరిశీలించనున్న బీఎల్వోలు
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏఎ్‌సడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓటర్లపై ఆందోళనల నేపథ్యంలో జిల్లాలో మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు ఏఎ్‌సడీ ఓటర్ల జాబితాల ఆధారంగా ఆయా ఇళ్లకు వెళ్లి వివరాలను పునఃపరిశీలించనున్నారు. బీఎల్వోలు పొరబాటున ఎవరి ఓటునైనా ఏఎస్డీలో చేర్చి.. తొలగించి ఉంటే సంబంధిత ఓటర్లతో అక్కడికక్కడే ఫారం-6లో దరఖాస్తు చేయించి జాబితాలో పేరుని చేర్చేందుకు చర్యలు చేపడతారు. జిల్లాలో 1,36,059 మంది ఓటర్లు ఏఎస్డీగా ఉన్నట్లు తేల్చారు. వీరందరికీ ఆయా ఈఆర్వోలు నోటీసులు జారీ చేసి, విచారణ జరిపారు. అందులో మరో 2489 మంది అనర్హులుగా తేల్చారు. అయితే అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు ఓటరు జాబితాలో లేకుండా ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఏఎస్డీ డబ్బులు ఇంటీరియల్‌గా గుర్తించిన 1,36,059, అనర్హులుగా గుర్తించిన 2489 మంది మొత్తం 1,38,548 మంది ఓటర్ల వివరాలను పునఃపరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.