ఓం నమః శివాయః
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:13 AM
ఓం నమః శివాయః సిద్ధం నమః అంటూ కాణిపాకంలోని ఆస్థాన మండపంలో శుక్రవారం చిన్నారులచే అక్షరాలు దిద్దించారు. తొలుత బాసర తరహాలో సరస్వతీ యాగాన్ని నిర్వహించారు.
కాణిపాక ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
ఓం నమః శివాయః సిద్ధం నమః
అంటూ కాణిపాకంలోని ఆస్థాన మండపంలో శుక్రవారం చిన్నారులచే అక్షరాలు దిద్దించారు. తొలుత బాసర తరహాలో సరస్వతీ యాగాన్ని నిర్వహించారు. ప్రతి చిన్నారికి సరస్వతి కటాక్షం కలగాలని ఆస్థాన మండపంలోని వేదికపై సరస్వతి విగ్రహం, సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను ఉంచి అర్చక,పండితులు పూజలు చేశారు. సరస్వతి హోమం నిర్వహించి పూర్ణాహుతిని చేశారు. అనంతరం పూజలో ఉంచిన పలకలపై చిన్నారుల చేత వారి తల్లిదండ్రులతో ఓనమాలు దిద్దించారు. 620 మంది చిన్నారులతో వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని వారి చేత అక్షరాభ్యాసం చేయించారు. కాణిపాక క్షేత్రంలో ఎటు చూసినా చిన్నారులతో పలకలు పట్టుకుని ఉన్న తల్లిదండ్రులు కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్, బోర్డు సభ్యులు నాగరాజునాయుడు, కృష్ణవేణి, వసంతమ్మ, చంద్రకళ, శివప్రసాద్, ఏఈవోలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
- ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి