Share News

అమ్మో.. ఎండ

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:50 AM

జిల్లాలో పది రోజులుగా సూర్యుడు మండుతుండడంతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో చేరుకుంటున్నాయి. ఉదయం 9 గంటలకే నెత్తిమీద నిప్పుల కుంపటి పెట్టుకున్నట్లు ఉంటుంది. ఉదయం 10 గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి.

అమ్మో.. ఎండ
బోసిపోయిన గాంధీ సర్కిల్‌

జిల్లాలో పది రోజులుగా సూర్యుడు మండుతుండడంతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో చేరుకుంటున్నాయి. ఉదయం 9 గంటలకే నెత్తిమీద నిప్పుల కుంపటి పెట్టుకున్నట్లు ఉంటుంది. ఉదయం 10 గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం అత్యధికంగా పెద్దపంజాణి మండలంలో 39.2 డిగీల్ర పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మండలాల వారీగా.. తవణంపల్లెలో 38.3, నగరిలో 38.2, బంగారుపాళ్యం, శ్రీరంగరాజపురంలో 37.7, పలమనేరులో 37.6, గంగవరం, రొంపిచెర్లలో 36.8, విజయపురం, నిండ్ర, పులిచెర్ల, వెదురుకుప్పంలో 36.5, పాలసముద్రం, యాదమరి, పెనుమూరులో 36.3, ఐరాల, రామకుప్పంలో 36.3, చిత్తూరు అర్బన్‌, చిత్తూరు రూరల్‌, గుడిపాలలో 36.1, గంగాధరనెల్లూరులో 35.8, పూతలపట్టులో 35.7, కుప్పం, శాంతిపురంలో 35.6, కార్వేటినగరంలో 34.4, బైరెడ్డిపల్లె, వి.కోటలో 33.1, గుడుపల్లెలో 33.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 01 , 2026 | 01:50 AM