Share News

అధికారులు బిజీబిజీ!

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:36 AM

సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈనెల 3, 4, 5 తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సంగతి తెలిసిందే. బహిరంగ సభలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈనేపథ్యంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌ డూడీ, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ బుధవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు.

అధికారులు బిజీబిజీ!
ఎల్పీజీ క్రెమిటోరియం వద్ద సూచనలిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

సీఎం పర్యటన ఏర్పాట్లలో తలమునకలు

పర్యటన ప్రాంతాల్లో పర్యవేక్షణలు, సమీక్షలు

కుప్పం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈనెల 3, 4, 5 తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సంగతి తెలిసిందే. బహిరంగ సభలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈనేపథ్యంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌ డూడీ, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ బుధవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. గుడుపల్లె మండలం పొగురుపల్లె పారిశ్రామిక వాడ, ఎంఎ్‌సఈ పార్కులో నిర్వహించనున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండు కూడలిలో బహిరంగ సభా స్థలంలో పర్యటించి సూచనలు చేశారు. మోడల్‌ ఆర్టీసీ బస్టాండు శంకుస్థాపన స్థలాన్ని సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు.ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించనున్న సీటీ స్కానింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. శ్మశాన వాటికలో గ్యాస్‌ క్రెమిటోరియం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంగుందిలో బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం కడా సమావేశ మందిరంలో ఎస్పీ తుషార్‌ డూడీ, కడా పీడీ వికాస్‌ మర్మత్‌తో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Jul 02 , 2026 | 01:36 AM