కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
ABN , Publish Date - May 25 , 2026 | 12:51 AM
ఎన్నారై టీడీపీ అధ్వర్యంలో కువైట్‌లో ఆదివారం ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మదనపల్లె, మే 24(ఆంధ్రజ్యోతి): ఎన్నారై టీడీపీ అధ్వర్యంలో కువైట్‌లో ఆదివారం ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కువైట్ దేశంలోని పర్వానియాలో సుగవాసి యువసేన అధ్యక్షుడు కంచన రెడ్డిశేఖర్, టీడీపీ యూత్ కువైట్ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్‌ఖాన్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హాజరయ్యారు. టీడీపీ కోసం నిరంతరం పనిచేస్తున్న ఎన్నారై అభిమానులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.