48 మద్యం దుకాణాలకు నేడు నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:26 AM
48 మద్యం దుకాణాలకు లైసెన్సుల కేటాయింపునిమిత్తం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 248 ఎ-4 మద్యం దుకాణాలుండగా.. 202 దుకాణాల లైసెన్సులు పునరుద్ధరించబడ్డాయి.మిగిలిన 46 దుకాణాలతో పాటు గతంలో పనిచేయని మరో రెండు దుకాణాలను కలిపి నూతన లైసెన్సింగ్ విధానంలో లాటరీ ద్వారా కేటాయింపులు చేపట్టనున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు.
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): 48 మద్యం దుకాణాలకు లైసెన్సుల కేటాయింపునిమిత్తం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 248 ఎ-4 మద్యం దుకాణాలుండగా.. 202 దుకాణాల లైసెన్సులు పునరుద్ధరించబడ్డాయి.మిగిలిన 46 దుకాణాలతో పాటు గతంలో పనిచేయని మరో రెండు దుకాణాలను కలిపి నూతన లైసెన్సింగ్ విధానంలో లాటరీ ద్వారా కేటాయింపులు చేపట్టనున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎక్సైజ్ డీసీ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లీశ్వరరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. అక్టోబరు 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 3న దరఖాస్తుల పరిశీలన నిర్వహించి.. 5న ఉదయం 8 గంటలకు కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహిస్తారు.ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా, ఒకే దుకాణానికి ఎన్నిసార్లయినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు రావాల్సి ఉంటుంది. నాలుగు దరఖాస్తులు రాని దుకాణాలకు నిబంధనల మేరకు గడువు పొడిగించే అవకాశం ఉంది. స్టేషన్ల వారీగా దుకాణాలు.....శ్రీకాళహస్తి10, నాగలాపురం 10, గూడూరు 9, చంద్రగిరి 6, వెంకటగిరి 5, పుత్తూరు 2, సూళ్లూరుపేట 4, తిరుపతి రూరల్ 1, వాకాడు 1 చొప్పున మొత్తం 48 దుకాణాలకు లైసెన్సులు కేటాయించనున్నారు.