నేటి నుంచే నామినేషన్లు
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:50 AM
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్ పత్రాల స్వీకరణకు కేంద్రాలను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు (18వ తేదీ వరకు).. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 21వ తేదీన ఉపసంహరణ గడువు ఉండగా, 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మున్సిపాలిటీల వారీగా స్వీకరణ కేంద్రాల ఏర్పాటు
చిత్తూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్ పత్రాల స్వీకరణకు కేంద్రాలను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు (18వ తేదీ వరకు).. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 21వ తేదీన ఉపసంహరణ గడువు ఉండగా, 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మున్సిపాలిటీ వార్డులు కేంద్రాలు
చిత్తూరు 60 15
కుప్పం 32 15
పలమనేరు 36 12
నగరి 40 10
మొత్తం 168 52