Share News

కొత్త ఏడాదికి ఆహ్వానం

ABN , Publish Date - Jan 01 , 2026 | 12:59 AM

2026వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి చిన్నాపెద్దా సిద్ధమయ్యారు.దీంతో చిత్తూరులోని ఏ బజారు చూసినా కిటకిటలాడుతోంది.

కొత్త ఏడాదికి ఆహ్వానం
చిత్తూరు చర్చి వీధిలో దుకాణాల వద్ద సందడి

చిత్తూరు కల్చరల్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): 2026వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి చిన్నాపెద్దా సిద్ధమయ్యారు.దీంతో చిత్తూరులోని ఏ బజారు చూసినా కిటకిటలాడుతోంది.పూల బొకేల, పండ్ల దుకాణాలతో పాటు బేకరీలు బుధవారం సాయంత్రం కొనుగోలుదారులతో నిండిపోయాయి.హోటళ్లలో స్వాగత వేడుకల పేరుతో ప్రత్యేక డీజే ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు.ఫుడ్‌ కాంబినేషన్‌ ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు.ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ స్వెగ్గీకి బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల దాకానే సుమారు 650కి పైగా ఆర్డర్లు రాగా, జోమోటోకు దాదాపు 900 ఆర్డర్లు వచ్చినట్లు చెబుతున్నారు.చిత్తూరులో లాడ్జీలు, మోస్తరు స్థాయి హోటళ్లు నూతన సంవత్సర వేడుకలకు బుక్‌ చేసుకున్నవారితో నిండిపోయాయి.మద్యం షాపుల వద్ద క్యూలు కన్పిస్తున్నాయి.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Updated Date - Jan 01 , 2026 | 12:59 AM