ద్రావిడ వర్సిటీలో ఈ ఏడాది నుంచి కొత్త కోర్సులు
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:44 AM
ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీజీ, డిగ్రీల్లో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య మల్లయ్య తెలిపారు. శనివారం ఎమినో అతిఽథి భవనంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల విద్యార్థులు చదివేందుకు వీలుగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
వీసీ ఆచార్య మల్లయ్య
గుడుపల్లె, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీజీ, డిగ్రీల్లో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య మల్లయ్య తెలిపారు. శనివారం ఎమినో అతిఽథి భవనంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల విద్యార్థులు చదివేందుకు వీలుగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.364 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ద్రావిడలో త్వరలో ఎన్టీఆర్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ద్రావిడ సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా మ్యూజియం కూడా ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. అధ్యాపకులు పరిశోధన, వర్క్‌షాపుల నిర్వహణకు నిధులు కోరామన్నారు. ఎంపీ దగ్గుమళ్ల్ల ప్రసాదరావు నిఽధులతో విద్యార్థులు విశ్వవిద్యాలయానికి చేరుకునేలా కుప్పం నుంచి రెండు ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేయనున్నామన్నారు. జాతీయ స్థాయిలో విశ్వవిద్యాయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి రిజిస్టార్ కిరణ్‌కుమార్, అకాడమిక్ డీన్ ఆచార్య శ్యామల, ఫైనాస్స్ ఆఫీసర్ డాక్టర్ ఫళణిలు పాల్గొన్నారు.