విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:39 AM
ఎల్‌నినో ప్రభావానికి తోడు విద్యుశాఖ అధికారుల నిర్లక్ష్యం వెరసి తొట్టంబేడు మండలం చేమూరులో సుమారు వంద ఎకరాల్లో వరిపంట నిలువును ఎండిపోతోంది. కళ్లెదుట
వందెకరాల్లో ఎండుతున్న వరిపంట
శ్రీకాళహస్తి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావానికి తోడు విద్యుశాఖ అధికారుల నిర్లక్ష్యం వెరసి తొట్టంబేడు మండలం చేమూరులో సుమారు వంద ఎకరాల్లో వరిపంట నిలువును ఎండిపోతోంది. కళ్లెదుట చేతికి అందివస్తున్న వరిపంట వసివాడిపోతుండడంతో గుండెలు బాదుకోవడం రైతుల వంతవుతోంది.చేమూరు దళితులు లేట్ ఖరీఫ్ కింద సుమారు వందెకరాల్లో వరిపంట సాగు చేశారు.పంట పక్వదశలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చియ్యవరం సబ్‌స్టేషన్ నుంచి చేమూరు వెళ్లే ఫీడర్‌లో పదిరోజులుగా క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో మోటార్ల కింద సాగవుతన్న పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. నిరంతర బ్రేక్ డౌన్ల కారణంగా మోటార్లు సైతం కాలిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు.అసలే ఎల్‌నినో ప్రభావంతో ఉన్న కాస్త నీటితడులు అవిరైపోతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం పంటల పాలిట శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తొట్టంబేడు విద్యుత్‌శాఖ ఏఈ బాలాజీని ఈ విషయంపై వివరణ కోరగా సోమవారం చేమూరులో పర్యటించానని,మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు రైతులకు విద్యుత్ సరఫరా చేయాలని లైన్‌మ్యాన్‌ను ఆదేశించినట్లు తెలిపారు.