Share News

3న 9కేంద్రాల్లో నీట్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:32 AM

జిల్లాలో మే మూడో తేదీన నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌(యూజీ)-2026) నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో నరసింహలు తెలిపారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. నీట్‌ రాసే 4,542మంది విద్యార్థుల కోసం తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

3న 9కేంద్రాల్లో నీట్‌

- హాజరు కానున్న 4,542మంది విద్యార్థులు

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మే మూడో తేదీన నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌(యూజీ)-2026) నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో నరసింహలు తెలిపారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. నీట్‌ రాసే 4,542మంది విద్యార్థుల కోసం తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైజన్‌ అధికారులు, జిల్లా నోడల్‌ అధికారి, సిటీ కోఆర్డినేటర్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిలోని పరీక్ష కేంద్రాలివే..

కేంద్రీయ విద్యాలయం-1, తిరుపతి. ఫ ఎస్వీయూ క్యాంపస్‌ హైస్కూల్‌(బాలాజీకాలనీ). ఫ ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల(లక్ష్మీపురం సర్కిల్‌). ఫ ఎస్‌జీఎస్‌ హైస్కూల్‌, భవానీనగర్‌ ఫ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల, బాలాజీకాలనీ. ఫ పద్మావతి మహిళా యూనివర్సిటీ. ఫ ఎస్వీ జూనియర్‌ కళాశాల. ఫ ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల.

Updated Date - Apr 25 , 2026 | 01:32 AM