ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:52 AM
జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జేసీ శివనారాయణశర్మ ఆధ్వర్యంలో ఏపీసీఎన్‌ఎ్‌ఫ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
మదనపల్లె టౌన్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జేసీ శివనారాయణశర్మ ఆధ్వర్యంలో ఏపీసీఎన్‌ఎ్‌ఫ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో వైవిద్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. టమోట, వేరుశనగ సాగుతో పాటు పశుగ్రాస పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఇళ్ల వద్ద న్యూట్రిషన్ గార్డెన్స్ నిర్వహించేలా అవగాహన కల్పించాలన్నారు. జేసీ మాట్లాడుతూ బీడు భూములను గుర్తించి వాటిలో పశుగ్రాసం సాగుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కల్యాణి, డీఏవో హరిప్రియ, ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, ఏపీసీఎన్‌ఎ్‌ఫ మేనేజర్ వెంకటమోహన్ పాల్గొన్నారు.