నాసా శాస్త్రవేత్త నృత్యాభిషేకం
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:38 AM
ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచే భరతనాట్యమంటే ఎంతో ఇష్టం. విద్యార్థి వయస్సులోనే భారతదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిపోయినా.. చిన్నతనంలో నేర్చుకున్న నాట్యాన్ని మరువలేదు. ఓవైపు నృత్యం నేర్చుకుంటూనే కెరీర్‌పై కూడా దృష్టిసారించి నాసా శాస్త్రవేత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడంతోపాటు భరతనాట్యంలోనూ డిప్లొమా చేసి అనేక ప్రదర్శనలతో మంచి పేరు పొందింది డాక్టర్ కావ్య కె మన్యపు.
ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచే భరతనాట్యమంటే ఎంతో ఇష్టం. విద్యార్థి వయస్సులోనే భారతదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిపోయినా.. చిన్నతనంలో నేర్చుకున్న నాట్యాన్ని మరువలేదు. ఓవైపు నృత్యం నేర్చుకుంటూనే కెరీర్‌పై కూడా దృష్టిసారించి నాసా శాస్త్రవేత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడంతోపాటు భరతనాట్యంలోనూ డిప్లొమా చేసి అనేక ప్రదర్శనలతో మంచి పేరు పొందింది డాక్టర్ కావ్య కె మన్యపు. 19 ఏళ్లుగా నాసాలో శాస్త్రవేత్తగా ఉన్న ఆమె శనివారం శ్రీవారి ఆలయం ముందున్న నాదనీరాజనం వేదికపై తన బృందంతో కలిసి నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు. సింధూజ, సృష్టి అనే కళాకారులతో కలిసి అన్నమయ్య కీర్తనలకు నృత్యాభిషేకం చేశారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి