తిరుమలలో నారా భువనేశ్వరి
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:36 AM
సీఎం చంద్రబాబు సతీమణి,ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సతీమణి,ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని గాయత్రి అతిథిగృహానికి చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, గురువారం ఉదయం ఆమె ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.కాగా తిరుపతి విమానాశ్రయంలో ఆమెకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు.గుడిమల్లం ఆలయ విశిష్టతను తెలిపే బుక్‌లెట్‌ను బహూకరించారు.