Share News

ఉక్కుపాదం మోపాలి: ఇన్‌చార్జి కలెక్టర్‌,ఎస్పీ

ABN , Publish Date - Aug 12 , 2026 | 02:19 AM

మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్‌లు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిర్మూలన కమిటీ సమావేశం నిర్వహించారు.

ఉక్కుపాదం మోపాలి: ఇన్‌చార్జి కలెక్టర్‌,ఎస్పీ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్‌

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్‌లు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిర్మూలన కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆపరేషన్‌ వజ్ర కింద చేపట్టిన చర్యలను లోతుగా పరిశీలించాలన్నారు. విద్యార్థుల హాస్టళ్లలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా వార్డెన్లకు, పీజీ హాస్టల్‌ నిర్వాహకులకు సూచించాలన్నారు. విద్యాసంస్థల పరిధిలో 100 మీటర్ల వరకు పొగాకు ఉత్పత్తులు విక్రయాలపై నిబంధలను అమలు చేయాలన్నారు. 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి బేరీజు వేసుకోవాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ 8 నెలల్లో ఏడు గంజాయి కేసులు నమోదు చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయి నెట్‌వర్స్‌పై నిఘా ఉంచామన్నారు. ఇద్దరిపై పిట్‌ ఎన్‌డీపీఎ్‌స యాక్టు విధించామన్నారు. సమావేశంలో డీఎస్పీలు బుచ్చిరాజు, కృష్ణమోహన్‌, ఆర్డీవో శ్రీనివాస్‌, డీఈవో సుబ్రమణ్యం, ఐసీడీఎస్‌ పీడీ హైమావతి, డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య, ఎక్సైజ్‌ ఈఎస్‌ మధుసూధన్‌, ఆర్టీవో అశోకప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 02:19 AM