వలస కార్మికుడి హత్య
ABN , Publish Date - May 12 , 2026 | 02:11 AM
శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో సారధి అనే వలస కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు.రూరల్ ఎస్‌ఐ వెంటకేష్ కథనం మేరకు.... తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా వాలాజీకి చెందిన సారథి అలియాస్ అప్పు(25) రాచగున్నేరి వద్ద ఓ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు.
నిందితుడు సహోద్యోగే
శ్రీకాళహస్తి, మే 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో సారధి అనే వలస కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు.రూరల్ ఎస్‌ఐ వెంటకేష్ కథనం మేరకు.... తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా వాలాజీకి చెందిన సారథి అలియాస్ అప్పు(25) రాచగున్నేరి వద్ద ఓ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు.మధురై జిల్లా తేని గ్రామానికి చెందిన శ్రీధర్ అదే పరిశ్రమలో కొంతకాలం క్రితం వెల్దర్‌గా చేరాడు. వీరిద్దరూ రాచగున్నేరి వద్ద ఒకే అద్దె గదిలో కలిసి ఉండేవారు. ఇటీవల శ్రీధర్‌ను తప్పించి సారథిని సూపర్‌వైజర్‌గా నియమించారు.దీంతో ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా విబేధాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇద్దరూ గదిలో మద్యం మత్తులో ఉన్న సమయంలో మాటామాటా పెరిగింది. శ్రీధర్ బీరుబాటిల్‌తో సారధిపైౖ దాడి చేసి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.