పురపోరు ప్రశాంతం
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:11 AM
శ్రీకాళహస్తిలో గురువారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 66.46 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచీ సాయంత్రం పోలింగ్ గడువు ముగిసే దాకా కూడా ఇంచుమించు ఒకే స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు.ఉదయం 11 నుంచీ మధ్యాహ్నం ఒక గంట మధ్యలో మాత్రం కాస్తంత ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలి వచ్చారు. మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
శ్రీకాళహస్తి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తిలో గురువారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 66.46 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచీ సాయంత్రం పోలింగ్ గడువు ముగిసే దాకా కూడా ఇంచుమించు ఒకే స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు.ఉదయం 11 నుంచీ మధ్యాహ్నం ఒక గంట మధ్యలో మాత్రం కాస్తంత ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలి వచ్చారు. మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 72,537 మంది ఓటర్లకు గానూ 48,307 ఓట్లు పోలయ్యాయి. 34,863 మంది పురుష ఓటర్లలో 22,876 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 37,670 మంది మహిళా ఓటర్లలో 25,429మంది ఓటు వేశారు. ఇతర ఓటర్లు నలుగురుండగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. 2014లో చివరిసారిగా ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగగా అప్పట్లో 66.46 శాతం పోలింగ్ నమోదైంది. ఇంచుమించు ఇపుడు కూడా అంతే శాతం నమోదైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపాలిటీ పరిధిలో 69 శాతం పోలింగ్ జరిగింది. కాగా పట్టణంలో పోలింగ్ సందర్భంగా స్వల్ప స్థాయిలో వాగ్వాదాలు, ఫిర్యాదులు, ఆరోపణలు తప్పితే మొత్తంమీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు వరప్రసాద్ పరిశీలించారు.పోలింగ్ ముగిసిన తరువాత తమాషా సంభాషణలు ముదిరి గొడవకు దారి తీశాయి. 37వ వార్డులో టీడీపీ శోభన, వైసీపీ అభ్యర్థి ముత్తు,ఏజెంట్‌గా పనిచేసిన జనార్దన్ బంధువులు. నాలుగు ఓట్లు మిగిలాయని, వాటిని చెరోరెండు వేసుకుని వుంటే బాగుండేదంటూ శోభనతో జనార్దన్ అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇలాగే చేసి తనను ఓడించారా అంటూ శోభన విలపిస్తూ జనసేన నాయకుడుమునిశేఖర్‌కు ఫోన్ చేయగా పానగల్ వద్దకు చేరుకున్నాడు.జనార్దన్ పిలవడంతో ఆయనకు బావ అయిన వైసీపీ చైర్మన్ అభ్యర్థి దాస్ కూడా అక్కడకు వెళ్లాడు. ఈ క్రమంలో వైసీపీ, కూటమి శ్రేణులమధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దాస్ చొక్కా చిరిగిపోవడం చూసి మునిశేఖర్‌ముక్కుపై జనార్దన్ దాడి చేయడంతో గాయపడ్డాడు.పోలీసులకు ఇరువర్గాల నుంచీ ఫిర్యాదులు అందాయి.