మూషిక వాహనమొక్కి..! - పురవీధుల్లో ఊరేగిన వరసిద్ధుడు
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:58 AM
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి మూషిక వాహనసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లె, కాణిపాకపట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాలకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం చేశారు. అనంతరం స్వామికి చందనాలంకారం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ అలంకారంలో భాగంగా మూలవిరాట్‌ను చందనంతో కప్పి స్వామి ఆకృతి కనపడేలా ఉల్లెన్ దారాలను వినియోగించారు. దీంతో స్వామి రూపం స్పష్టంగా భక్తులకు కనబడుతుంది. చందనాలంకారంలో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఇష్టపడతారు. ఇక, రాత్రికి ఉభయదారులు ఉభయ వరస తీసుకొచ్చి స్వామివారి ఉత్సవర్లకు పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. అనంతరం సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లను మూషిక వాహనంపై అధిష్ఠింపచేసి పురవీధులలో ఊరేగించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి మూషిక వాహనసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లె, కాణిపాకపట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాలకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం చేశారు. అనంతరం స్వామికి చందనాలంకారం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ అలంకారంలో భాగంగా మూలవిరాట్‌ను చందనంతో కప్పి స్వామి ఆకృతి కనపడేలా ఉల్లెన్ దారాలను వినియోగించారు. దీంతో స్వామి రూపం స్పష్టంగా భక్తులకు కనబడుతుంది. చందనాలంకారంలో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఇష్టపడతారు. ఇక, రాత్రికి ఉభయదారులు ఉభయ వరస తీసుకొచ్చి స్వామివారి ఉత్సవర్లకు పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. అనంతరం సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లను మూషిక వాహనంపై అధిష్ఠింపచేసి పురవీధులలో ఊరేగించారు.
వరసిద్ధుడికి పట్టు వస్త్రాల సమర్పణ
కాణిపాక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం తరపున ట్రస్టుబోర్డు చైర్మన్ కొట్టేసాయి, ఈవో బీకే వెంకటేశు, దుర్గామల్లేశ్వరం ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ వరసిద్ధుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరు వేర్వేరు సమయాల్లో కాణిపాకంలోని చైర్మన్ కార్యాలయం నుంచి పట్టువస్త్రాలను మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు,ఈవో పెంచలకిషోర్, ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌కు అందజేశారు. స్వామిని దర్శించుకున్నాక కల్యాణ వేదిక వద్ద వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి శేవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ బోర్డు సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నరేష్, శివప్రసాద్, రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, వసంత, శ్రీవాణి, ఏఈవోలు రవీంద్రబాబు, ధనపాల్, ధనంజయ, సూపరింటెండెంట్లు వాసు కోదండపాణి, శ్రీకాళహస్తి ఆలయ ఏఈవో మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు
శుక్రవారం ఉదయం బంగారు చిన్న శేషవాహనం, రాత్రి బంగారు పెద్ద శేషవాహన సేవలు ఉంటాయి. కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాంపల్లె, మిట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, 44బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లె గ్రామాల కమ్మ వంశస్థులు ఉభయదారులు.