పుష్పపల్లకిలో సిరులతల్లి
ABN , Publish Date - Mar 20 , 2026 | 02:08 AM
శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి పుష్పపల్లకిపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.ఉగాదిని పురస్కరించుకుని ఉదయం కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది.సాయంత్రం కేటీ మండపంలో ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించాక వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు
తిరుచానూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి పుష్పపల్లకిపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.ఉగాదిని పురస్కరించుకుని ఉదయం కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది.సాయంత్రం కేటీ మండపంలో ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించాక వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు.రాత్రి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్ సురే్‌షకుమార్, మునిచెంగల్రాయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.