పిచ్చికుక్క కాటుతో 15మందికి పైగా గాయాలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:22 AM
ఓ పిచ్చికుక్క శుక్రవారం కొరకడంతో సుమారు 15మందికి పైగా గాయాల పాలయ్యారు.
చిత్తూరు రూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తవణంపల్లె మండలంలో ఓ పిచ్చికుక్క శుక్రవారం కన్పించినవారందరినీ కొరకడంతో సుమారు 15మందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిలో 13 మంది చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.బాధితుల్లో ఏడుగురు పిల్లలున్నారు. తవణంపల్లె మండలంలోని మత్యం క్రాస్‌లో శుక్రవారం సాయంత్రం ఓ పిచ్చికుక్క రోడ్డులో బస్సు కోసం వేచివున్న మహిళను, వృద్ధుడిని కరిచింది. చుట్టుపక్కలున్నవారు తరిమికొట్టడంతో అక్కడినుంచి వెళ్లిపోయింది.ఉత్తర బ్రాహ్మణపల్లి, కాణిపాకం, తవణంపల్లి ఇలా దారిలో ఎవరు కనిపిస్తే వారిపై దాడిచేసి విక్షణరహితంగా కొరికింది.బాధితులు చికిత్సకోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలిసి అప్రమత్తమైన అవుట్‌పోస్ట్ ఏఎ్‌సఐ ఆంజనేయులు ఈ సమాచారాన్ని తవణంపల్లె, కాణిపాకం ఎస్‌ఐలకు పంపించారు.కాగా పిచ్చి కుక్క దాడిలో గాయాలై చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఎవరూ పట్టించుకోలేదని, నొప్పితో అరుస్తున్నా పలకరించలేదని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.