దివ్యాంగులకు మరింత అండ
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:27 AM
దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ వెంకటేశ్వర్,ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉద్ఘాటించారు. అలిపిరిలోని ఆర్టీసీ డిపోగ్యారేజీ ఆవరణంలో బుధవారం దివ్యాంగశక్తి పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు.
తిరుపతి అర్బన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ వెంకటేశ్వర్,ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉద్ఘాటించారు. అలిపిరిలోని ఆర్టీసీ డిపోగ్యారేజీ ఆవరణంలో బుధవారం దివ్యాంగశక్తి పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు.దివ్యాంగులకు ఎక్కడా లేని విధంగా నెలకు రూ.6వేలు, మంచానికే పరిమితమైనవారికి రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నామని, జిల్లాలో దాదాపు 30వేల మందికి ఇలా పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. ఇదే తరహాలో దివ్యాంగశక్తిని కూడా విస్తృతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటికే 5,385మంది పీహెచ్‌సీ పాసులు కలిగివున్నారని, ఈ పథకం అమలు ద్వారా దివ్యాంగుల సంఖ్య దాదాపు 30వేలకు పెరిగే అవకాశముందని, ఏడాదికి రూ.12.78కోట్లు వారికి ఆదా అవుతుందన్నారు.ప్రయాణ సమయంలో వారిపట్ల డ్రైవర్లు, కండక్టర్లు ప్రత్యేక శ్రద్ధవహించి సీట్లు కేటాయించాలన్నారు. బస్టాండులలో ర్యాంపుల నిర్మాణం, ఎక్కడం, దిగడంలో సహాయం వంటి అంశాలలో సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించారు.దివ్యాంగ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ప్రసాద్, విజయ్‌శేఖర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ప్రకా్‌ష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఆఫీసుకు వెళ్లినా తక్షణమే స్పందన లభిస్తోందని, ప్రత్యేక గౌరవం దక్కుతోందని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి కలెక్టర్ పచ్చజెండా ఊపి దివ్యాంగశక్తి బస్సులను ప్రారంభించారు. కండక్టర్ ద్వారా జీరోఫేర్ టిక్కెట్‌ను జారీచేయించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి కొంతదూరం ప్రయాణించి, సహపంక్తి భోజనం చేశారు. ఆ తరువాత వారిని గమ్యస్థానాలకు చేర్చారు.శాప్ చైర్మన్ రవినాయుడు,కార్పొరేషన్ల ఛైర్మన్లు నరసింహ యాదవ్, సుగుణమ్మ, పసుపులేటి హరిప్రసాద్,సీఆర్ రాజన్, రుద్రకోటి సదాశివం,తుడా ఛైర్మన్ దివాకరరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, రాజారెడ్డి, ఆర్టీసీ అఽధికారులు జగదీష్, విశ్వనాథం, బాలాజీ, చాందిని, హరిబాబు, నిర్మల, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.