నైతిక విలువలు కొనసాగించాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:11 AM
తిరుపతిలో కోర్టులు, బార్ అసోసియేషన్ రెండూ ఎప్పటి నుంచో కొనసాగిస్తున్న నైతిక విలువలను ఇకమీదటా కొనసాగించాలని ఏపీ హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. తిరుపతిలో కోర్టు కాంప్లెక్సు శంకుస్థాపన కార్యక్రమానికి దేశంలోని అత్యున్నత న్యాయమూర్తులు తరలిరావడం సంతోషకరంగా ఉందన్నారు. వందేళ్ల అవసరాలకు సరిపడేలా ఇక్కడ కోర్టు కాంప్లెక్సు నిర్మాణం సాగాలని సూచించారు. ప్రస్తుతమున్న పాత కాంప్లెక్సు ఆవరణలోకి ప్రవేశించడానికి కూడా ఇరుగ్గా వుంటుందని స్థానిక జడ్జి గురుమూర్తి చెప్పారంటూ కొత్త కాంప్లెక్సుతో అలాంటి సమస్యలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ప్రశాంత్ కుమార్ మిశ్రా, పీఎ్‌స నరసింహ, అసదుద్దీన్ అమానుల్లా, ఎస్వీఎన్ భట్టి, జోవిమాల్య బాగ్చి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జయసూర్య, డి.రమేష్, మహేశ్వర్, శేఖర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి అరుణా సారిక, తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టి గజేంద్ర, హైకోర్టు అధికారులు, జిల్లాలోని న్యాయాధికారులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయడు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్