Share News

సాంకేతిక రంగాల్లో ఆధునిక పరిశోధనలు కీలకం

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:56 AM

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆధునిక పరిశోధనలు కీలకంగా మారుతున్నాయని తిరుపతి ఐఐటీ నవిష్కర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి రోషన్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

సాంకేతిక రంగాల్లో ఆధునిక పరిశోధనలు కీలకం
అంతర్జాతీయ సదస్సు సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్లు

మదనపల్లె టౌన్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆధునిక పరిశోధనలు కీలకంగా మారుతున్నాయని తిరుపతి ఐఐటీ నవిష్కర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి రోషన్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రోషన్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు వారిలోని నైపుణ్యాలను మార్చుకోవాలన్నారు. పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను చూపించాలన్నారు. ఈ సదస్సులో కళాశాల డైరెక్టర్‌ ఎస్‌.రామలింగారెడ్డి, అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, కరస్పాండెంట్‌ రామ్మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ పి.రాయుడు, సదస్సు కన్వీనర్‌ గంగాధర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:56 AM