Share News

మదనపల్లెలో మోస్తరు వర్షం

ABN , Publish Date - May 07 , 2026 | 01:20 AM

మదనపల్లెలో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడమేగాక ఆకాశం మేఘావృతమైంది.

మదనపల్లెలో మోస్తరు వర్షం
గొడుగుతో వెళ్తున్న మహిళలు

చల్లబడిన వాతావరణం

ఎండుతున్న పంటలకు ఊపిరి

మదనపల్లె, మే 6(ఆంధ్రజ్యోతి): మదనపల్లెలో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడమేగాక ఆకాశం మేఘావృతమైంది. అరగంట పాటు పెద్ద జల్లులతో కూడిన వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు లేకుండా వరుణుడు వర్షించాడు. రోడ్లు, కాలువల్లో ప్రవాహం కనిపించింది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత వీధులు, రోడ్లలో పిల్లల కేరింతలు కనిపించాయి. చల్లటి గాలికి పెద్దలు బయటకు వచ్చి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించారు. రెండున్నర నెలలుగా వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు, శ్రమజీవులకు ఉపశమనం కలిగింది. తీవ్రమైన ఎండలతో ఎండుముఖం పట్టిన టమోటా, ఇతర వాణిజ్య పంటలకు ఊపిరిపోసినట్లయింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే బుధవారం రోజున, అందులోనూ మధ్యాహ్నం 3గంటల నుంచి అరగంట పాటు గాలులతో కూడిన వర్షం పడింది.

Updated Date - May 07 , 2026 | 01:20 AM