అన్నమయ్య జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:20 AM
అన్నమయ్య జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం మంజూరైంది. శుక్రవారం స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న వాహనాన్ని ఎస్పీ ధీరజ్ ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెచ్చారు.
మదనపల్లె క్రైం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం మంజూరైంది. శుక్రవారం స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న వాహనాన్ని ఎస్పీ ధీరజ్ ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన మాట్లాడుతూ ఘటన స్థలంలో నిందితుల రక్తపు మరకలు, వేలిముద్రలు తుడిచేసి సాక్ష్యాలను మాయం చేసినా అందులోని హైఇంటెన్సిటీ లైట్ ద్వారా బలమైన ఆధారాలు సేకరించవచ్చన్నారు. డీఎన్‌ఏ, ఇతర 10రకాల అత్యాధునిక కిట్లు, మైక్రోస్కోప్ పరికరాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా హిట్ అండ్ రన్, లైంగిక దాడులు, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, తుపాకీ కాల్పుల కేసుల్లో సైతం స్పాట్‌లోనే శాస్ర్తీయ ఆధారాలు సేకరించడానికి ఈ సాంకేతికత అద్భుతంగా పనిచేస్తుందని వివరించారు. అనంతరం వాహనాన్ని జిల్లా క్లూస్ టీం ఇన్చార్జి సీఐ సునీల్‌కు అప్పగించారు.