నేడు మంత్రి లోకేశ్ రాక
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:39 AM
మంత్రి నారా లోకేశ్ నేటిసాయంత్రం తిరుపతికి వస్తున్నారు. బుధవారం తిరుపతి గొల్లవానిగుంటలోని ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్సును ఉదయం 9.15గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం 10.40గంటలకు చంద్రగిరిలోని నూతన ఎంపీడీవో కార్యాలయంతో పాటు నారా రామ్మూర్తినాయుడు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్సును ప్రారంభిస్తారు.
తిరుపతి(కలెక్టరేట్)/తిరుపతి అర్బన్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్ నేటిసాయంత్రం తిరుపతికి వస్తున్నారు. బుధవారం తిరుపతి గొల్లవానిగుంటలోని ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్సును ఉదయం 9.15గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం 10.40గంటలకు చంద్రగిరిలోని నూతన ఎంపీడీవో కార్యాలయంతో పాటు నారా రామ్మూర్తినాయుడు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్సును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుచానూరు సమీపంలోని రామానాయుడు కల్యాణమండపంలో టీడీపీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 5గంటలకు నెల్లూరు జిల్లాకు బయల్దేరి వెళతారు.లోకేశ్ పర్యటన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని, శాప్ చైర్మన్ రవినాయుడు, తుడా చైర్మన్ దివాకర రెడ్డి తదితరులు పరిశీలించారు. గొల్లవానిగుంటలో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లు, భద్రత, సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం ఉదయం మంత్రి నారా లోకేశ్ క్రికెట్ స్టేడియం ప్రారంభించాక క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు.