మంత్రి లోకేశ్ రాక ఆలస్యం
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:57 AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి ఆలస్యంగా తిరుపతి చేరుకున్నారు.నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఆయన మంగళవారం రాత్రి 7.40 గంటలకు రావాల్సి వుండగా 2.20 గంటల ఆలస్యంగా రాత్రి 10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఆయనకు స్వాగతం పలికేందుకు నాయకులతో పాటు విమానాశ్రయం వెలుపల భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి.
విమానాశ్రయం వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు
పాసుల్లేనివారిని అనుమతించని భద్రతా సిబ్బంది
సీఐఎ్‌సఎఫ్ సిబ్బందితో కార్యకర్తల వాగ్వాదం
తిరుపతి/రేణిగుంట, ఏప్రిల్ 14 (ఆంద్రజ్యోతి):టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి ఆలస్యంగా తిరుపతి చేరుకున్నారు.నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఆయన మంగళవారం రాత్రి 7.40 గంటలకు రావాల్సి వుండగా 2.20 గంటల ఆలస్యంగా రాత్రి 10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఆయనకు స్వాగతం పలికేందుకు నాయకులతో పాటు విమానాశ్రయం వెలుపల భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. కేవలం 200 మందికి మాత్రమే పాసులు జారీ చేయడంతో పాసులు లేని వారిని సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది విమానాశ్రయంలోనికి అనుమతించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగాయి. స్థానిక పోలీసులు సర్దిచెప్పినప్పటికీ సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది భద్రతా కారణాల రీత్యా పాసులు లేనివారిని లోపలికి అనుమతించలేమంటూ తిరస్కరించారు.చివరకు విమానాశ్రయ అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో కార్యకర్తలు శాంతించారు. అనంతరం మంత్రి లోకేశ్ విమానాశ్రయం నుంచీ రోడ్డు మార్గాన తిరుపతి చేరుకున్నారు. నగర శివార్లలోని రామానాయుడు కళ్యాణ మండపం వద్ద రాత్రికి కారవాన్ బస్సులోనే బస చేశారు. బుధవారం ఉదయం తిరుపతి, చంద్రగిరిల్లో క్రీడా సముదాయాలను ప్రారంభిస్తారు. అపై చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సుదీర్ఘంగా సమావేశమవుతారు. సాయంత్రం తిరుపతి నుంచీ నెల్లూరు మీదుగా గుంటూరు బయల్దేరి వెళతారు. మంత్రి లోకేశ్‌కు తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, నెలవల విజయశ్రీ, బొజ్జల సుధీర్‌రెడ్డి, మురళీమోహన్,కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాప్ ఛైర్మన్ రవినాయుడు, తుడా ఛైర్మన్ దివాకర రెడ్డి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, వన్నియ కుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ సీఆర్ రాజన్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, సత్యవేడు టీడీపీ ఇంఛార్జి శంకర్‌రెడ్డి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేశ్ యాదవ్ తదితరులతో పాటు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేశ్ విమానాశ్రయం నుంచీ రోడ్డు మార్గాన తిరుపతి చేరుకున్నారు. నగర శివార్లలోని రామానాయుడు కళ్యాణ మండపం వద్ద ఆయన రాత్రికి కారవాన్ బస్సులోనే బస చేశారు. బుధవారం తిరుపతి, చంద్రగిరిలలో క్రీడా సముదాయాలను ప్రారంభిస్తారు. అపై చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సుదీర్ఘంగా సమావేశమవుతారు. సాయంత్రం తిరుపతి నుంచీ నెల్లూరు మీదుగా గుంటూరు బయల్దేరి వెళతారు.
లోకేశ్ పర్యటన ఇలా...
తిరుపతి గొల్లవానిగుంటలోని ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్సును ఉదయం 9.15గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం 10.40గంటలకు చంద్రగిరిలోని నూతన ఎంపీడీవో కార్యాలయంతో పాటు నారా రామ్మూర్తినాయుడు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్సును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుచానూరు సమీపంలోని రామానాయుడు కల్యాణమండపంలో టీడీపీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 5గంటలకు నెల్లూరుకు బయల్దేరి వెళతారు.