బైక్‌ను ఢీకొన్న మినీ లారీ
ABN , Publish Date - Aug 16 , 2026 | 02:08 AM
స్థానిక ముంబయి - చెన్నై జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు...
యువకుడి దుర్మరణం
ములకలచెరువు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ముంబయి - చెన్నై జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు...మండలంలోని వేపూరికోట పంచాయతీ పెద్దపల్లికి చెందిన ఇదగొట్టి శంకర కుమారుడు గణేశ్‌కుమార్(23) పదవ తరగతి వరకు చదివాడు. ప్రస్తుతం మగ్గం పనులు చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి బురకాయలకోటలో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పట్టుకొని స్వగ్రామానికి వెళ్తుండగా జాతీయ రహదారిలోని రెడ్డివారిపల్లె క్రాస్ వద్ద మినీ లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గణేశ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి ఘటనా స్ధలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువకుడు తండ్రి శంకర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.