బిల్లుల పెండింగ్‌పై సభ్యుల ధ్వజం
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:09 AM
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో బిల్లుల పెండింగ్‌పై సభ్యులు నిలదీశారు. అధిక శాతం పీఆర్, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌సలోనే పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఈసారి కూడా మెజారీటీ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. షోకాజ్ నోటీసులు అందజేసినా తీరు మారలేదు.
జడ్పీ స్టాంగింగ్ సమావేశానికీ మళ్లీ అధికారులు డుమ్మా
చిత్తూరు రూరల్, మార్చి 21(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో బిల్లుల పెండింగ్‌పై సభ్యులు నిలదీశారు. అధిక శాతం పీఆర్, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌సలోనే పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఈసారి కూడా మెజారీటీ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. షోకాజ్ నోటీసులు అందజేసినా తీరు మారలేదు. ఈ విషయమై కలెక్టర్‌తో చర్చించనున్నట్లు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వివిధ శాఖల సిబ్బంది హాజరై సభ్యులు ప్రశ్నలు, సమస్యలను నమోదు చేసుకున్నారు. తమ సార్‌కు చెప్తామంటూ బదులిచ్చారు. రంజాన్ సెలవు కావడంతో జిల్లా స్థాయి అధికారులు హాజరుకాలేదని తెలిసింది.
ఫ2017, 2018లో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌సలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వడమాలపేట జడ్పీటీసీ మరళీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పనులకు సబంధించిన ఎంబుక్‌లు కూడా కనిపించడం లేదన్నారు. మరో 10 రోజుల్లో ఈ పథకం కూడా మారిపోతోందన్నారు. మండలంలో వ్యవసాయ సర్వీసులకు డబ్బులు చెల్లించి రైతులు నిరీక్షిస్తున్నారన్నారు.
ఫ కొన్ని మండలాల్లో ఎంపీడీవోలు సభ్యులకు కనీసం మర్యాద ఇవ్వడం లేదని నారాయణవనం జడ్పీటీసీ సుమన్ వాపోయారు. సత్యవేడు ఎమ్మెల్యే సొంత గ్రామం భీమునిచెరువులో నక్కలచేరువు ఆయకట్ట పనులు చేసి రెండేళ్లయినా బిల్లులు మంజూరు చేయడం లేదన్నారు. అనేక ప్రాంతాల్లో గ్రావెల్ రోడ్లు నిర్మించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
ఫ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రేషన్ షాపులన్నీ సూపర్ మార్కెట్‌లా మారుతున్న సివిల్ సప్లె అధికారులు పట్టించుకోవడంలేదని కుప్పం జడ్పీటీసీ శరవణన్ నిలదీశారు. షాపులోని మిగిలిన వస్తువులు కొనుగోలు చేస్తేనే రేషన్ సరుకులు ఇస్తున్నారన్నారు.
ఫ రామసముద్రం మండలంలో విలేజ్ క్లినిక్ భవన నిర్మాణాలు ఐదు సంవత్సరాలుగా అసంపూర్తిగానే ఉన్నాయని రామసముద్రం జడ్పీటీసీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దీంతో గ్రామీణులకు వైద్యం అందడం లేదన్నారు.
ఫ గుడుపల్లి మండలంలో విద్యుత్ లైన్లు తగిలి ముగ్గురు మృతి చెందినా విద్యుత్ శాఖ ఇప్పటి వరకు ఎటుంటి నష్టపరిహారం అందించలేదని గుడుపల్లి జడ్పీటీసీ క్రిష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.