పండుగలా మెగా పీటీఎం
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:00 AM
పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ వారి చదువు, ప్రవర్తనలో ఆశించిన మార్పులను సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్- టీచర్ మీటింగ్ కార్యక్రమానికి నాంది పలికింది. జిల్లలోన్ని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ మెగా పీటీఎంను పండుగ వాతావరణంలో నిర్వహించారు. వేలాది మంది తల్లిదండ్రులు ఉత్సహంగా పాల్గొన్నారు. కేవలం విద్యార్థుల మార్కులు, గ్రేడ్లకే పరిమితం కాకుండా వారి సమగ్ర వికాసం, పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేరుగా చర్చించుకున్నారు. ఉపాధ్యాయుల- తల్లిదండ్రుల
2102 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహణ
1,10,232 మంది విద్యార్థులు, 1,04,315 మంది తల్లిదండ్రుల హాజరు
చిత్తూరు సెంట్రల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ వారి చదువు, ప్రవర్తనలో ఆశించిన మార్పులను సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్- టీచర్ మీటింగ్ కార్యక్రమానికి నాంది పలికింది. జిల్లలోన్ని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ మెగా పీటీఎంను పండుగ వాతావరణంలో నిర్వహించారు. వేలాది మంది తల్లిదండ్రులు ఉత్సహంగా పాల్గొన్నారు. కేవలం విద్యార్థుల మార్కులు, గ్రేడ్లకే పరిమితం కాకుండా వారి సమగ్ర వికాసం, పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేరుగా చర్చించుకున్నారు. ఉపాధ్యాయుల- తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ మెగా పీటీఎం కీలకంగా మారింది. రొంపిచెర్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డితో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. చిత్తూరులోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కార్వేటినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే థామస్, నగరి చింతలపట్టడ జడ్పీహెచ్‌ఎ్‌సలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పూతలపట్టులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే మురళీ మోహన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తల్లికి వందనంతో కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలను కమిటీ సభ్యులు వివరించగా, తమవంతు సాయం అందించేందుకు దాతలు ముందుకొచ్చారు. పూర్వ విద్యార్థులు సైతం చేయూతనిస్తామని చెప్పారు. టీచర్లకు టగ్‌ఆ్‌ఫవార్, మూజికల్ ఛైర్స్, స్పూన్-లెమన్, రన్నింగ్ వంటి చిన్నపాటి పోటీలు నిర్వహించారు.
తల్లిదండ్రులతో టీచర్ల ముఖాముఖి
టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు లీప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం, వాటి ప్రయోజనాలను వివరించారు. తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించి, చదువులో వారి పిల్లలు ఎలాంటి స్థాయిలో ఉన్నారనేది సమీక్షించారు. ప్రతి రోజూ పిల్లలు ఏ సబ్జెక్టులో.. ఏం నేర్చుకున్నారనేది తెలుసుకోవాలని సూచించారు.