హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:44 AM
హజ్ యాత్రకు వెళ్లే వారికి ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిస్ర్టిక్ట్ హర్బ్‌టేజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఉషశ్రీ ఐదుగురు డాక్టర్లతో కలిసి బీపీ, షుగర్, ఆర్‌బీఎస్ తదితర పరీక్షలు చేశారు.
మదనపల్లె అర్బన్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): హజ్ యాత్రకు వెళ్లే వారికి ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిస్ర్టిక్ట్ హర్బ్‌టేజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఉషశ్రీ ఐదుగురు డాక్టర్లతో కలిసి బీపీ, షుగర్, ఆర్‌బీఎస్ తదితర పరీక్షలు చేశారు. వ్యాక్సినేషన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్బరీ జునైద్, హజ్ కమిటీ రాష్ట్ట్ర కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్‌ఖాన్, మైనార్టీ నాయకులు, ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.