Share News

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు

ABN , Publish Date - Aug 28 , 2026 | 02:14 AM

):స్విమ్స్‌ ఆస్పత్రి ద్వారా పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించడానికి కృషి చేస్తానని స్విమ్స్‌ డైరెక్టర్‌, వీసీ డాక్టర్‌ గుడారు జగదీష్‌ చెప్పారు.స్విమ్స్‌ నూతన డైరెక్టర్‌గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బర్డ్‌, స్విమ్స్‌ అధికారులు ఘన స్వాగతం పలికారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు
స్విమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్‌ జగదీష్‌

తిరుపతి సెంట్రల్‌/తిరుమల, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి):స్విమ్స్‌ ఆస్పత్రి ద్వారా పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించడానికి కృషి చేస్తానని స్విమ్స్‌ డైరెక్టర్‌, వీసీ డాక్టర్‌ గుడారు జగదీష్‌ చెప్పారు.స్విమ్స్‌ నూతన డైరెక్టర్‌గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బర్డ్‌, స్విమ్స్‌ అధికారులు ఘన స్వాగతం పలికారు.ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు.ఈ సందర్భంగా డాక్టర్‌ జగదీష్‌ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా ట్రైబల్‌ ఏరియాల్లో స్విమ్స్‌ తరపున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.స్విమ్స్‌లో నిష్ణాతులైన డాక్టర్ల బృందం వుందని వారి ద్వారా స్విమ్స్‌ను రాష్ట్రంలోనే ప్రముఖ ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు.ఆరు నెలల కాలంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుందన్న ఆయన ఆస్పత్రి భవనంపై ఎయిర్‌ అంబులెన్సు దిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.స్విమ్స్‌లో ఎమర్జెన్సీ మెడిసన్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని,బ్లడ్‌ బ్యాంకు సేవలు విస్తృతపరుస్తామన్నారు.స్విమ్స్‌ ఎంఎస్‌ డాక్టర్‌ రామ్‌, సీనియర్‌ సీఎంవో శివశంకర్‌, మెడిసన్‌ విభాగాధిపతి డాక్టర్‌ అల్లాడి మోహన్‌, డాక్టర్‌ అలోక్‌సచిన్‌, దిలీప్‌, రేడియాలజీ విభాగాధిపతి శిల్ప, సీఎంవో డాక్టర్‌ భారతి, జగదీష్‌, డాక్టర్‌ వనజ, డాక్టర్‌ పాల్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ కోటిరెడ్డి, బర్డ్‌ ఆర్‌ఎంవో వెంకారెడ్డి తదితరులు డాక్టర్‌ జగదీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.గురువారం మధ్యాహ్నం తిరుమలకు వెళ్లిన డాక్టర్‌ జగదీష్‌ టీటీడీ చైర్మన్‌, స్విమ్స్‌ ఛాన్సలర్‌ బీఆర్‌ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. జాయినింగ్‌ రిపోర్టును చైర్మన్‌కు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మీడియాతో మాట్లాడారు.డాక్టర్‌ జగదీ్‌ష స్విమ్స్‌లో ఉన్నతమైన వైద్య సేవలు అందిస్తారని ఆశిస్తున్నామన్నారు.స్విమ్స్‌లో సేవలపై గతంలో అనేక విమర్శలు వచ్చాయని, ఎంతో అనుభవం, కలిగిన జగదీష్‌ వాటిని దూరం చేస్తారనే నమ్మకం ఉందన్నారు.అనంతరం డాక్టర్‌ జగదీష్‌ మాట్లాడుతూ తిరుపతిని ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.ఎన్టీఆర్‌ వైద్యసేవను మరింత విస్తరించి పేదరోగులకు ఆర్థిక భారం తగ్గిస్తామన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 02:14 AM