జంట ఏనుగుల్ని తరిమేలా చర్యలు
ABN , Publish Date - May 15 , 2026 | 01:04 AM
రామకుప్పం మండలం ననియాల సమీప తోటలపై జంట ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి అవి మామిడికొమ్మల్ని విరిచి, కాయల్ని తిన్నంతగా తిని నేలపాలు చేశాయి.
రామకుప్పం, మే 14 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలం ననియాల సమీప తోటలపై జంట ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి అవి మామిడికొమ్మల్ని విరిచి, కాయల్ని తిన్నంతగా తిని నేలపాలు చేశాయి. అటవీ అధికార్లు, బేస్‌క్యాంపు సిబ్బంది వాటిని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో అవి పరుగులు తీస్తూ పైరును ధ్వంసం చేసుకుంటు అర్ధరాత్రి అడవిలోకి వెళ్లాయి. ఉన్నతాధికారుల అదేశాలతో స్థానిక అటవీ విభాగాధికారి హరికుమార్, అధికారులు, బేస్‌క్యాంపు సిబ్బందితో కలిసి గురువారం ఉదయం ననియాల సమీప అడవిలోకి వెళ్లారు. అడవిలో జంట ఏనుగుల ఆచూకీ తెలుసుకుని, అటవీ లోతట్టు ప్రాంతానికి తరిమే కార్యక్రమం చేపట్టారు.