Share News

నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:11 AM

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం కేవీబీపురం, తొట్టంబేడు మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.

నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు

తిరుపతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం కేవీబీపురం, తొట్టంబేడు మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. చిట్వేలు, కోడూరు, ఓబులవారిపల్లెల్లో 39.1డిగ్రీలు, డక్కిలిలో 38.7, ఆర్‌సీపురంలో 38.5, పెనగలూరు,పుల్లంపేట, తిరుపతి రూరల్‌ మండలాల్లో 38.4, నారాయణవనం, సత్యవేడు, సూళ్ళూరుపేట, పాకాల, పుత్తూరు, వరదయ్యపాళెం మండలాల్లో 38.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పలు మండలాల్లో నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం జిల్లాలోని 22 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు మండిపోనున్నాయి. ఓజిలి, బాలాయపల్లె మండలాల్లో 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కానుంది. అలాగే పెళ్ళకూరులో 40.9 డిగ్రీలు, తొట్టంబేడులో 40.9, డక్కిలిలో 40.8, వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో 40.7 డిగ్రీల చొప్పున, ఏర్పేడులో 40.6, రేణిగుంట, కేవీబీపురం మండలాల్లో 40.5 చొప్పున, సూళ్ళూరుపేట, పిచ్చాటూరు, దొరవారిసత్రం, పెనగలూరు, చిట్వేలి మండలాల్లో 40.2 డిగ్రీల చొప్పున, తిరుపతి అర్బన్‌లో 40.1 డిగ్రీల చొప్పున, వడమాలపేట, నారాయణవనం, నాగలాపురం మండలాల్లో 40 డిగ్రీల వంతున ఉష్ణోగ్రత లు నమోదు కానున్నాయి.బుధవారం జిల్లాలో 11 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటనున్నాయి. అత్యధికంగా పెనగలూరు మండలంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. చిట్వేలిలో 40.9 డిగ్రీలు, డక్కిలి, బాలాయపల్లెల్లో 40.7 డిగ్రీల చొప్పున, ఓజిలిలో 40.5, వెంకటగిరి, పుల్లంపేటల్లో 40.4 డిగ్రీల చొప్పున, ఓబులవారిపల్లెలో 40.3, తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లో 40.1 చొప్పున, నాయుడుపేటలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు మండిపోనున్నాయి.

Updated Date - Apr 07 , 2026 | 02:11 AM