Share News

రేపు మారిషస్‌ అధ్యక్షుడి రాక

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:35 AM

మారిషష్‌ దేశాధ్యక్షుడు ధరంబీర్‌ గోకుల్‌ మంగళవారం తిరుపతికి రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన శ్రీకాళహస్తికి వెళ్లి ముక్కంటిని దర్శించుకుంటారు.

రేపు మారిషస్‌ అధ్యక్షుడి రాక
జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య

శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల సందర్శన

తిరుపతి(కలెక్టరేట్‌): జనవరి 4(ఆంధ్రజ్యోతి): మారిషష్‌ దేశాధ్యక్షుడు ధరంబీర్‌ గోకుల్‌ మంగళవారం తిరుపతికి రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన శ్రీకాళహస్తికి వెళ్లి ముక్కంటిని దర్శించుకుంటారు. అనంతరం తిరుచానూరు సమీపంలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుని తిరుమలకు బయలుదేరి వెళతారు. వేదపాఠశాలను సందర్శిస్తారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎస్పీ సుబ్బరాయుడు, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య తదితరులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు ఏఎ్‌సఎల్‌ను నిర్వహించారు. మారిషస్‌ అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్లపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ భూమినాఽధన్‌, ఇతర అధికారులతో వారు సమీక్షించారు.

Updated Date - Jan 05 , 2026 | 01:35 AM