ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:22 AM
శ్రీకాళహస్తిలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న రెండు కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తిలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న రెండు కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.పట్టణంలో మొత్తం ఆరు కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా రెండు కేంద్రాల్లో కొందరు ఇన్విజిలేటర్లు విద్యార్థులకు బహిరంగ సహకారం అందిస్తున్నట్లు చెబుతున్నారు.దీనిపై జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజశేఖర రెడ్డిని వివరణ కోరగా విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.