మార్చి..అప్పుడే మాడ్చి..
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:08 AM
చిత్తూరు జిల్లాలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచే సూర్యుడు ప్రతాపం చాటుతున్నాడడు. సాధారణంగా 3వ వారం తరువాత ఎండలు తీవ్ర రూపం దాల్చేవి. ఇందకు భిన్నంగా రెండు రోజుల క్రితం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. శనివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది. ఎండల సమాచారంపై ఇప్పటివరకూ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయలేదు. జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలలో అధికారులు ఎండల నుంచి ఉపశమనం కోసం చర్యలు చేపట్టలేదు. ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు, చలివేంద్రాల జాడ లేదు.