ముక్కంటి ఆలయం వద్ద వ్యక్తి వీరంగం
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:53 AM
శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద మంగళవారం తమిళనాడుకు చెందిన వ్యక్తి వీరంగం చేశాడు. భక్తులను భయబ్రాంతులకు గురిచేశాడు. కారు పార్కింగ్‌లోని ఓ కారు అద్దాలు పగులగొట్టాడు. ప్రశ్నించిన భక్తులపై వాగ్వాదానికి దిగాడు.
శ్రీకాళహస్తి,జనవరి 13(ఆంద్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద మంగళవారం తమిళనాడుకు చెందిన వ్యక్తి వీరంగం చేశాడు. భక్తులను భయబ్రాంతులకు గురిచేశాడు. కారు పార్కింగ్‌లోని ఓ కారు అద్దాలు పగులగొట్టాడు. ప్రశ్నించిన భక్తులపై వాగ్వాదానికి దిగాడు. భక్తుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీ్‌సస్టేషన్‌కు తరలించి విచారించారు. అతడి బ్యాగులో ఏటీఎం, క్రెడిట్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. మతిస్థిమితం లేకపోవడంతో కారు అద్దాలు పగులగొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.