Share News

మామిడి పండ్ల కవర్ల యూనిట్‌ ప్రారంభం

ABN , Publish Date - Jan 24 , 2026 | 02:19 AM

తవణంపల్లె మండలం మత్యం పైపల్లెలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మామిడి పండ్ల కవర్ల యూనిట్‌ను ఉద్యానశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోటేశ్వరావు శుక్రవారం ప్రారంభించారు.

మామిడి పండ్ల కవర్ల యూనిట్‌ ప్రారంభం

తవణంపల్లె, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తవణంపల్లె మండలం మత్యం పైపల్లెలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మామిడి పండ్ల కవర్ల యూనిట్‌ను ఉద్యానశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోటేశ్వరావు శుక్రవారం ప్రారంభించారు. మామిడి కాయలకు కవర్లు కట్టడంతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని ఆయన చెప్పారు. చీడపీడల నుంచి రక్షణ కలిగి మార్కెట్‌లో అధిక ధర సాధించవచ్చన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 02:19 AM