మొదలైన మామిడి వ్యాపారం
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:33 AM
పుత్తూరు మామిడి కాయల మండీలో మామిడి వ్యాపారం మొదలైంది. మండకీ పరిసర గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున మామిడి కాయలను తీసుకొచ్చి అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
పుత్తూరు టౌన్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పుత్తూరు మామిడి కాయల మండీలో మామిడి వ్యాపారం మొదలైంది. మండకీ పరిసర గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున మామిడి కాయలను తీసుకొచ్చి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలకు భయపడి రైతన్నలు పక్వానికి రాకుండానే మామిడి కాయలను కోసేసి పచ్చళ్లకు విక్రయిస్తున్నారు. ఈ పచ్చళ్లకు ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌లో గిరాకీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పచ్చికాయలు రుమాని టన్ను రూ.20 వేల నుంచి రూ.25వేలు.. బెంగుళూరు రూ.15-20 వేలు అమ్మకాలు జరుగుతున్నాయి. దాంతో రైతున్నలు బస్తాలలో మామిడి కాయలను మండీలకు తరలిస్తున్నారు. మొత్తానికి పుత్తూరు మండీ కళకళలాడుతోంది.