పోలీసుల భయంతో కాలువలో పడి మృతి
ABN , Publish Date - May 12 , 2026 | 02:10 AM
పోలీసులు దాడి చేయబోతున్నారన్న సమాచారంతో పేకాట ఆడుతున్న వారిలో ఒకరు పారిపోబోయి ఆరణియార్ కాలువలో పడి మృతి చెందిన సంఘటన నాగలాపురం మండలంలో చోటు చేసుకుంది.
నాగలాపురం, మే 11, (ఆంధ్రజ్యోతి): పోలీసులు దాడి చేయబోతున్నారన్న సమాచారంతో పేకాట ఆడుతున్న వారిలో ఒకరు పారిపోబోయి ఆరణియార్ కాలువలో పడి మృతి చెందిన సంఘటన నాగలాపురం మండలంలో చోటు చేసుకుంది.కాళంజేరి గ్రామస్తుడు రాజేంద్ర నాయుడికి సంబంధించిన మామిడి తోటలో సోమవారం కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది.ఎ్‌సఐ సునీల్ తన బృందంతో వస్తున్నారన్న సమాచారంతో పేకాటరాయుళ్లు పక్కనే ఉన్న ఆరణియార్ కాలువ పక్క పరుగులు తీసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిలో ఒకరైన ఈశ్వరయ్య(53) కాలువను దాటే ప్రయత్నంలో బురద నీటిలో చిక్కుకుని మునిగిపోయాడు.పోలీసులు కాలువలోకి దూకి ఈశ్వరయ్యను బయటకు తీసేలోపు మృతి చెందాడు. ఈశ్వరయ్యను నారాయణవనం మండలం కళ్యాణపురం పంచాయతీ పద్మావతీ నగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.డీఎస్పీ రవికుమార్, సీఐ మురళీనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.