Share News

తెప్పపై మురిపించిన మలయప్ప

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:46 AM

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గోరోజు ఆదివారం శ్రీమలయప్పస్వామి తన దేవేరులతో కలిసి తెప్పపై దర్శనమిచ్చారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించిన తర్వాత పుష్కరిణిలో విద్యుత్‌, పుష్పాలంకరణలతో సిద్ధం చేసి తెప్పలో వేంచేపు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, అన్నమయ్య కీర్తనల నడుమ పుష్కరిణి చుట్టూ ఐదుసార్లు విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్‌స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

తెప్పపై మురిపించిన మలయప్ప
తెప్పపై మురిపించిన మలయప్ప

- తిరుమల, ఆంధ్రజ్యోతి

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గోరోజు ఆదివారం శ్రీమలయప్పస్వామి తన దేవేరులతో కలిసి తెప్పపై దర్శనమిచ్చారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించిన తర్వాత పుష్కరిణిలో విద్యుత్‌, పుష్పాలంకరణలతో సిద్ధం చేసి తెప్పలో వేంచేపు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, అన్నమయ్య కీర్తనల నడుమ పుష్కరిణి చుట్టూ ఐదుసార్లు విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్‌స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:46 AM